Share News

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:05 AM

మాదక ద్ర వ్యాలకు యువత, విద్యా ర్థులు దూరంగా తమ భవి ష్యత్తును నిర్ణయించుకోవాల ని ప్రభుత్వ విప్‌ వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కోరారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : మాదక ద్ర వ్యాలకు యువత, విద్యా ర్థులు దూరంగా తమ భవి ష్యత్తును నిర్ణయించుకోవాల ని ప్రభుత్వ విప్‌ వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కోరారు.శుక్రవారం జిల్లా పోలీ స్‌ శాఖ నేతృత్వతంలో మాద క ద్రవ్యాలతో కలిగే నష్టాలపై సిరిసిల్ల పట్టణంలోని అంబే ద్కర్‌ చౌరస్తా నుంచి చేప ట్టిన భారీ ర్యాలీని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, అదనపు ఎస్పీ చంద్రయ్యలతో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ జెండాను ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, నష్టాలపై విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు అకట్టుకున్నాయి, ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకం గా ప్రతిజ్ఞన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ స్టాల్‌లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈగ ల్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు చేస్తోంద న్నారు. యువత, విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరిం చారు. యువత సన్మార్గంలో వెళ్లేలా కార్యక్రమాలు చేస్తు న్నామన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బాటను వీడి మైదానం బాట పట్టి యువత సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈగల్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌పై దాడులతోపాటు వ్యతిరేకంగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. పోలీస్‌ శాఖ శాంతిభద్రతలతో పాటు రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేప ట్టారని, ప్రతి వాహనదారుడు తలకు హెల్మెట్‌ ధరించాలని, అలాగే కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్‌ పెట్టుకోవా లంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, సామాజిక బాధ్యతగా డ్రగ్స్‌కు వ్యతిరేక చర్యలు తీసుకుంటు న్నారని అభినందించారు. యువత, విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించేలా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా సీఎం రేవంత్‌రెడ్డి స్పోర్ట్స్‌ యూనివర్సిటీ తీసుకువచ్చా రన్నారు. అలాగే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సీఎం కప్‌ పేరిట కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చేలా కృషి చేశారని అభినందించారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ యువత, విద్యార్థులు తమకు నచ్చిన అంశాల్లో రాణించాలని కోరారు. అందరికీ శారీరక, మానసిక ఆరోగ్యం చాలా అవసరమని వివరించారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు బానిస కావద్దన్నారు. యువత, విద్యార్థులు ఖాళీగా ఉండవద్దని, నచ్చిన అంశాల్లో సమయం కేటాయించాలని సూచించారు. విద్యార్థులు చదువులో.. యువత తాము ఎంచుకున్న రంగం లేదా ఉద్యోగంలో ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రానికి తరలించాలని సూచిం చారు. డ్రగ్స్‌ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్‌ తీసుకు న్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత అనుకున్న లక్ష్యాలు సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలోని అన్ని విద్యాలయాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు డ్రగ్స్‌ రహితం కావాలని, ఆ దిశగా పక్కా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఈగల్‌ ఫోర్స్‌ టోల్‌ఫ్రీ నంబరు 1908 కంట్రోల్‌ రూం నంబర్‌ 8712671111 సేవలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీలు నాగేంద్ర చారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 12:05 AM