చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - May 04 , 2026 | 12:29 AM
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి చూపాలని బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
చందుర్తి మే 3 (ఆంధ్రజ్యోతి): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి చూపాలని బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి నిర్వహించిన కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పాల్గొ న్న జట్లకు ప్రోత్సాహకంగా ఉండేందుకు చందుర్తి మండలంలోని 10, రుద్రంగి 5 జట్ల క్రీడాకారులకు చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదివారం క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కప్‌తో క్రికెట్ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే కాకుండా గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులు తమ ప్రతిభను చాటార న్నారు. క్రీడారులకు క్రికెట్ కిట్లను అందజేసి ప్రోత్సాహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను వెలికితీ స్తామన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి చూపేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందున్నా రని గుర్తుచేశారు. గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ల నిర్వ హించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి-రుద్రంగి, మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, తిరుపతి, నాయకులు జలగం కిషన్‌రావు, తిప్పని శ్రీనివాస్, ఆకుల గంగారం, మరాటి మల్లిక్, బైరగోని రమేష్, చిలుక పెంటయ్య గంగం స్వరూప-మహేష్, డప్పుల అశోక్, ఏనుగుల శ్రీనివాస్, కొక్కుల నరేష్, పోతరాజు భారతి నగేష్, కాపిల్ల శంకర్, సహనాజు సమీర్, మోహన్ నాయక్ సరిత, దయ్యాల కమలాకర్, రాజేశం, ఎల్లయ్య, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.