లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:31 AM
జిల్లాలోని ప్రజలందరు ఈనెల 12న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ కోరారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రజలందరు ఈనెల 12న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ కోరారు. జిల్లా కోర్టులో బుధవారం న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నీరజ మాట్లాడుతూ సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పోక్సో కోర్టు న్యాయ మూర్తి రాధిక జైస్వాల్, సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి పి. లక్ష్మ ణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్‌జాదవ్, సిరి సిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి మేఘన తదితరులు పాల్గొన్నారు.