Share News

రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:00 AM

ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ కింద కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు.

రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల, జూలై 3 (ఆంరఽధజ్యోతి): ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ కింద కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు, వాటి పురోగతి, రాయితీ తదితర అంశాలపై శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్‌, మండల పరిషత్‌, పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ - 2020 కింద దరఖాస్తుదారులకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ కల్పించిందని వెల్లడించారు. ఈనెల 31వ తేదీ వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద జిల్లాలో 43,150 దరఖా స్తులు వచ్చాయని, వీటిలో 5,708 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించి ప్రక్రియ పూర్తి చేసుకున్నారని తెలిపారు. 3,316 దరఖాస్తులు వివిధ కారణాలతో తిర స్కరణకు గురయ్యాయని, 6,051 దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నా యని తెలిపారు. జిల్లాలో 28,075 మంది దరఖాస్తులు రాయితీకి అర్హత ఉన్నా యని, వాటికి నిర్ణిత ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయా లని వివరించారు. దరఖాస్తుల పరిశీలన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూములు నీటి వనరుల బఫర్‌ జోన్‌, నాలా, చెరువులు, హెరిటేజ్‌ బిల్డింగ్‌లు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను తిరస్కరించాలని ఆదేశించారు.

హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాయితీ, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని, ఒక సహాయకుడు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్న వారికి ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, లోకే ష్‌, డీటీసీపీవో అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:00 AM