ప్రకృతి, జీవరాసులపైన ప్రేమ కలిగి ఉండాలి..
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:32 AM
మానవాళిని కాపాడే ప్రకృ తి, జీవరాశులపైన ప్రేమ, దయ కలిగి ఉండాలని జిల్లా గ్రంథాలంయం చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మానవాళిని కాపాడే ప్రకృ తి, జీవరాశులపైన ప్రేమ, దయ కలిగి ఉండాలని జిల్లా గ్రంథాలంయం చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్నారు. ప్రకృతి, భారత రాజ్యాంగం వైజ్ఞానిక యాత్రను పురస్కరించుకొని శుక్రవారం సిరిసిల్ల గ్రంథాలయ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ మానవ చర్యలవల్ల ప్రకృ తి రోజురోజుకు విధ్వంసం అవుతుందని, ప్రకృతిని మనమే కాపాడుకో వాలన్నారు. విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ మను షుల్లో శాస్త్రీయ దృక్పథంల ోపించి ప్రశ్నించడం మర్చిపోతున్నాడని తద్వారా మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయన్నారు. సమాజంలో సా మాజిక, ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు ప్రకృ తి సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. కవి జయరాజు మాట్లాడుతూ ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రకృతిలోనే బతు కుతాడన్నారు. మానవ చర్యల వల్లన ప్రకృతి రోజు రోజుకు విద్వాంసం అవతుందని తద్వారా మనిషి అనేక అనారోగ్యాల పాలవుతున్నాడని అన్నరు. ప్రకృతిని కాపాడే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి రామరాజు, సంపత్‌రమేష్, ఈశ్వర్, లింగం కమటం మల్లయ్య, శ్యాం, పాఠకులు పాల్గొన్నారు.