పోలీస్‌శాఖ పనితీరుపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:12 AM
పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ మహేష్ బీ గితే కోరా రు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ మహేష్ బీ గితే కోరా రు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల పనితీరు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ, బాధి తులకు న్యాయం అందించేందుకు చేపట్టే చర్యలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యా గాలు ప్రతి ఒక్కరికీ స్ఫూరి దాయకమన్నారు. పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, శాఖ పని తీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రపై విద్యార్థు లకు అవగాహన కల్పించడ మే ఓపెన్ హౌస్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వి ద్యార్థులు విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని, పోలీస్ స్టేషన్ విధులు, ప్రజలకు అందించే సేవలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యతలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై స్టాళ్లు ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరస్తులను గుర్తించేం దుకు పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకే తిక పరిజ్ఞానం, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైజ్ వంటి ఆధునిక సాంకేతిక పరి కరాల పనితీరులను వివరించారు.నేరాల నివారణతో పాటు, జరిగిన నేరాలను త్వరగా ఛేదించడంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేశారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీంలు, భరోసా కేంద్రాల సేవలు, వాటి విధులపై అవగాహ న కల్పించారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి, బ్లాక్‌చేసి రికవరీ చేయడంలో సీఈ ఐఆర్ వ్యవస్థ వినియోగంపై వివరించారు. బాంబ్ స్క్వాడ్ విధులు, పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీ ర్యం చేసే విధానం, పోలీస్ జాగిలాల సేవలను తెలి యజేశారు. తప్పనిసరిగా వాహనాదారులు హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ఆన్‌లైన్‌లో అపరిచితు లతో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండా లని, సైబర్ నేరానికి గురైతే వెంటనే1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించా రు. కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటే శ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు గణేష్, అనిల్, రంజి త్, ఆర్‌ఎస్‌ఐ సాయికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.