శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:02 AM
కళాకారులు శిక్షణ ద్వారా తమ కళానైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
భగత్‌నగర్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కళాకారులు శిక్షణ ద్వారా తమ కళానైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్ధం ఎల్లారెడ్డిభవన్‌లో తెలంగాణ ప్రజా నాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల హితం కోసం సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళాకారులు తమ కళాలు, గళాలను ఉపయోగించాలన్నారు. శిబిరంలో సీపీఐ కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురుమిద్ద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యుడు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కటికరెడ్డి, బుచ్చన్నయాదవ్, టేకుమల్ల సమ్మయ్య, ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, సహాయ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ పాల్గొన్నారు.