వ్యక్తిగత భద్రతపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:58 PM
వ్యక్తిగత భద్రతపై విద్యా ర్థులు అవగాహన కలిగి ఉండాలని పోక్సో కోర్టు జిల్లా ప్రత్యేక న్యాయమూ ర్తి రాధిక జైస్వాల్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : వ్యక్తిగత భద్రతపై విద్యా ర్థులు అవగాహన కలిగి ఉండాలని పోక్సో కోర్టు జిల్లా ప్రత్యేక న్యాయమూ ర్తి రాధిక జైస్వాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురక్షత్ బచ్చన్ అభియాన్‌లో భాగం గా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై విద్యార్థు లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పోక్సో కోర్టు జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్ మాట్లాడా రు. పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యతిగత భద్రతపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని బాలలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి వేధింపులు అనుచిత ప్రవర్తన ఎదురైనా భయపడకుం డా సంబంధిత అధికారులకు తెలియజేయలని అన్నారు. పిల్లలపై జరిగే నేరాలను నివారించడం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రు లు సమష్టిగా బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాలల లైంగిక నేరాలకు పాల్పడితే విధించే శిక్షలు, బాలల చట్టపరమైన హక్కులు, రక్షణ చర్యలు, న్యాయపరిష్కార మార్గాల గురించి వివరించారు. అనంతరం తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ అందించిన అవగాహన కరపత్రాలను విద్యార్థులతో కలసి ఆవిష్క రించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎన్ రమాదేవి, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, ప్రభుత్వ న్యాయవాది కళ్యాణ్ చక్ర వర్తి, న్యాయవాదులు, ఆడెపు వేణు, పెంట శ్రీనివాస్, కుంట శ్రీనివాస్, కళ్యాణి, జైశ్వర్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.