లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలి
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:00 AM
విద్యార్థులు ఉన్నత లక్ష్యా లను నిర్ణయించుకుని పట్టుదలతో కృషి చేయాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ఉన్నత లక్ష్యా లను నిర్ణయించుకుని పట్టుదలతో కృషి చేయాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ కోరారు. జిల్లాలోని కస్తూర్భిగాంధీ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల కాగా జిల్లాలోని ప్రఽథ మ సంవత్సరంలో సిరిసిల్ల కేజీబీవీ బైపీసీలో కీర్తన 436, మర్రిపల్లి కేజీబీ వీకి చెందిన ఎంపీసీలో మమత 466, రుద్రంగి కేబీజీవీకి చెందిన ఎంపీ సీలో మమత 466, మార్కలు సాధించారు. తంగళ్లపల్లి కేజీబీవీకి ఎంపీ హెచ్ డబ్యూలో ఎల్ శ్రుతికి 490, వేములవాడ కేజీబీవీ ఏఐఎంఎల్‌లో అక్షితకు 486, మర్రిపల్లి కేజీబీవీలో శ్యామల ఎంపీసీలో 984, మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ గరి మ అగ్రవాల్‌ను కలిశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, జీసీడీవో పద్మజ, స్పెషల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శిరీష సూచించారు. పాఠశాల ఆవరణలో బుధవారం ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతై పాఠశాలలో చదివిన మధుమిత, అక్షయ, మధువర్షిణి, పల్లవిలు మంచి మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. వీరిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కస్తూరిభా పాఠశాలలో 6నుంచి ఇంటర్‌మీడియట్ వరకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు.