Share News

నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:58 PM

నేరాల నియంత్రణలో పోలీ స్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్‌ బీగీతే అధికారుల ను ఆదేశించారు.

నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : నేరాల నియంత్రణలో పోలీ స్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్‌ బీగీతే అధికారుల ను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం వేములవాడ సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పోలీస్‌ స్టేషన్ల పనితీరు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ అఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ శాస్త్రీయ ఆధారాలతో పట్టిష్టమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్వవహరించే అఽధికారులపై క్రమశిక్షణ చర్య లు తప్పవని హెచ్చరించారు. సీసీటీఎన్‌ఎస్‌ 2.0 ఈ సాక్ష్య, నాట్‌ గ్రిడ్‌ వంటి సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించి కేసులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సీసీటీవీ ఫుటేజీలు ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరగా ఛేదించి దొంగిలించిన సోత్తును భాదితులకు అప్ప గించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించం, ర్యాష్‌ డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసు లు, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, మొగిలి, మధుకర్‌, ఆర్‌ఐలు మధుకర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:58 PM