పరిసరాల పరిశుభ్రతను పాటించాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:52 AM
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ముఖ్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిడాక్టర్ ఏంజెలా ఆల్ర్ఫె డ్ అన్నారు.
వేములవాడ రూరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ముఖ్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిడాక్టర్ ఏంజెలా ఆల్ర్ఫె డ్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా న్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ ఏంజెలా ఆల్ర్ఫెడ్ గురువారం సంద ర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులకు ప్రత్యే క వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఆరో గ్యంగా ఉండేందుకు ఆమె సూచించారు. అనం తరం హాస్టల్ వంట గదిని తనిఖీ చేసి, ఆహార పదార్థాల నిల్వ, వంటకాల తయారీ, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు. వంట సిబ్బందికి చేతుల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థు లకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అం దించాలని సూచించారు. హాస్టల్ పరిసర ప్రాం తాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, దోమల నివారణకు క్రిమిసంహారక మందుల పిచికారీ చేయించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసు కోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమం లో హన్మాజీపేట వైద్యాధికారి డాక్టర్ దివ్యశ్రీ, సి హెచ్‌వో మోహన్, ఎంఎంపీహెచ్ ఈవో రామ నాథం, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.