Share News

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:32 AM

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పోలీసులు పొందాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్‌బీగీతే అన్నారు.

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పోలీసులు పొందాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్‌బీగీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం పరేడ్‌ మైదానంలో జిల్లా అర్మూడ్‌ రిజర్వ్‌, సివిల్‌, హోంగార్డు సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్‌కు హాజరైన ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన అర్మ్స్‌, ఫుట్‌, ట్రాఫిక్‌ డ్రిల్స్‌ ప్రదర్శనలు పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించా లని ప్రతిరోజు కనీసం అరగంట నడవడం, బయట ఆహారాన్ని వీలైనంత వరకు నివారించడం, క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవా లని కోరారు. వీక్లీ పరేడ్‌ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీగా ఉండ డం, ఫిజికల్‌ ఫిట్నెస్‌లకు ఉపయోగపడుతుందన్నారు. క్రమశిక్షణతో విధు లను నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలా పని చేస్తూ పోలీస్‌ శాఖతో పాటు జిల్లాకు మంచి పేరును తేవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని, సబ్బందికి ఏదైనా సమస్య ఉంటే ఎల్లప్పుడూ తనను కలుసుకోవచ్చని తెలిపారు. పరేడ్‌లో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐలు మధుకర్‌, సురేష్‌, రమేష్‌, ఆర్‌ఎస్‌ఐలు రాజు, శ్రావ ణ్‌యాదవ్‌, దిలీప్‌, సాయికిరణ్‌, ఆర్మ్‌డ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:32 AM