సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:58 PM
సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే ముందస్తు అప్రమత్తతే ప్రధా న ఆయుధమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు.
వేములవాడ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే ముందస్తు అప్రమత్తతే ప్రధా న ఆయుధమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. వేములవాడ మండలం అగ్రహారం గ్రామంలోని జెఎన్‌టీయూహెచ్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఎస్పీ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలలో డ్రగ్స్ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు ప్రధానమని, వీటీలో సైబర్ నేరాలు సాంకేతికత అభివృద్దితో కొత్త రూపాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాల బారిన పడకుండా విద్యా ర్థులు ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించడమే ప్రధాన ఆయుధమని సూచించారు. సైబర్ నేరాల్లో ప్రధానంగా ఆర్థిక మోసాలు, సోషల్ మీడియా ఆధారిత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరస్థులు సోషల్ మీడియ ద్వారా పరిచయాలు పెంచు కుని, నమ్మకం కలిగించిన అనంతరం వ్యక్తిగత వివ రాలు, ఫోటోలు సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి బెది రింపులకు పాల్పడటం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సోషల్ మీడి యాని జాగ్రత్తగా వాడాలని, ముఖ్యంగా సోషల్ మీడి యాలో వ్యక్తిగత సమాచారం ఎవరితో కూడా పంచుకో వద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్ షిప్‌లు, గిప్ట్ ఆఫర్లు, లక్కీడ్రా పేర్లతో మోసాలు జరుగు తున్నాయని వివరించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాల నివారణలో కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుం బ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే భయభ్రాంతులకు గురికాకుండా గంట వ్యవధి లో (గోల్డెన్ హవర్)లో 1930 నంబర్‌కు కాల్ చేసి, నేషనల్ సబైర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్ట ల్ ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్, క్రెడిట్ కార్డ్, మ్యాట్రిమోని, లాటరీ గిఫ్ట్, మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లారీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్, సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ క్రైమ్ ఆర్.ఎస్.ఐ జునైద్ అవగహన కల్పించారు. అనంతరం సైబర్ క్రైమ్‌కు సంబంధించిన పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీని వాసులు, పట్టణ సీఐ వీరప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.