సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:06 AM
సాంకేతికత పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వీటిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌ్‌స్ ఆలం అన్నారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సాంకేతికత పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వీటిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌ్‌స్ ఆలం అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) సౌజన్యంతో రూపొందించిన పాజ్ ఫర్ సేఫ్టీ (ఆగండి.. ఆలోచించండి.. సరిచూసుకోండి..) అవగాహన పోస్టర్‌ను పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సైబర్ మోసాలపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌస్ ఆలం బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ప్రధానంగా జరుగుతున్న సైబర్ మోసాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నకిలీ ఇన్వాయిస్‌లు, నకిలీ పర్చేజ్ ఆర్డర్లతో వ్యాపారులను మోసం చేసే ముఠాలు ఉన్నాయన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో తక్కువ పనికి ఎక్కువ డబ్బులు వస్తాయంటూ వచ్చే ఆఫర్లను నమ్మవద్దన్నారు. బ్యాంక్ అధికారులు, పోలీసులమని బెదిరిస్తూ వచ్చే కాల్స్‌పై జాగ్రత్త వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దన్నారు. భారీ డిస్కౌంట్ల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వెబ్‌సైట్ల లింకులను నమ్మి ముందుగానే నగదు చెల్లించి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా అధికారిక పోర్టల్ ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.ఛిౌఝలో ఫిర్యాదు నమోదు చేయాలని సీపీ సూచించారు. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయవద్దన్నారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టౌన్ ఇన్‌స్పెక్టర్లు, సైబర్ విభాగం ఎస్సైలు అనూష, ఎస్‌ఆర్ జూనియర్ ప్రైవేట్ కళాశాల జోనల్ ఇన్‌చార్జి తిరుపతి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.