‘పది’ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:10 AM
పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావే శ మందిరంలో బుధవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయు లు, బాధ్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాలల్లో మొత్తం 4405 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారని మార్చి 14నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్ల డించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో పదో తరగతి పరీక్షలకు ఫలితాలపై ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవి ష్యత్తును నిర్ణయించే కీలకమైన దశ అని అన్నారు. ఈ దశ లో చిన్న నిర్లక్ష్యం కూడా విద్యార్థుల జీవితంపై ప్రభావం చూపుతుందని అన్నారు. అందువల్ల ప్రతి ఉపాధ్యాయుడు తన బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల ను సామర్థ్యాల ఆధారంగా విభజించి, బలమైన విద్యార్థులు, సగటు విద్యార్థులు, వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రోజువారీగా అదనపు బోధన తరగతులు, రిమీడియల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. మోడల్ ప్రశ్నాపత్రా లు, గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలతో విద్యార్థులకు విస్తృ తంగా అభ్యాసం చేయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రగతిని సమీక్షించి మార్కుల్లో మెరుగుదల కనిపించని చోట తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం గైర్హాజరుఅవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడి, విద్యార్థులను పాఠశాలకు పంపేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల చదువు, ప్రగతి, లో పాలపై తల్లిదండ్రులకు సమాచారం అందిస్తూ, అందరి సహకారంతో ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, పాఠశాలల పనితీరును పర్యవేక్షించాలని, అవసరమైన మార్గనిర్దేశనం అందించాలని ఆదేశించారు.