ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:30 AM
ఆయిల్‌పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడి తో పాటు దీర్ఘకాలంపాటు ఆదాయాన్ని పొందవచ్చ ని, పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : ఆయిల్‌పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడి తో పాటు దీర్ఘకాలంపాటు ఆదాయాన్ని పొందవచ్చ ని, పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందరింలో గురువారం ఆయిల్ పామ్ సాగు, ఫర్టిలైజర్ యాప్, వ్యవసాయ యాంత్రీకర ణ, రైతుల వివరాల నమోదు, క్రాప్ బుకింగ్ తది తర అంశాలపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధి కారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ నిర్వహించారు. జిల్లాలో క్రాప్ బుకింగ్ కోసం ఏఈఓలకు సహాయం అందించేందుకు 165 మంది వలంటీర్లను నియమించామని కలెక్టర్ దృష్టికి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తీసుకువెళ్లారు. ఈసందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ క్రాప్ బుకింగ్ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ కింద జిల్లాలో ని అందరు రైతుల వివరాల ను అన్‌లైన్‌లో నమోదు చే యాలని ఆదేశించారు. చనిపో యిన, డబుల్ ఎంట్రీ వివరాలు జాబితాలో లేకుం డా పకడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు. ఏవో లు, ఏఈవోలు సంయుక్తంగా ఈ ప్రక్రియను రెం డువారాల్లో పూర్తిచేయాలని సూచించారు. వ్యవసా య యాంత్రీకీకరణ కింద జిల్లాకు మంజూరైన పరికరాలకు రైతులు దరఖాస్తు చేసుకునేలా అవ గాహన కల్పించాలన్నారు. ఫర్టిలైజర్ యాప్ విని యోగం, రైతులకు అందుతున్న సేవలపై మండలా ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఎరువుల షాప్, పీఏసీఎస్, పైవ్రేట్ దుకాణాల వద్ద హెల్ప్ డెస్క్‌ల్లో సహాయకులు అందుబాటులో ఉంచాలన్నారు. జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధి కారి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.