Share News

వానమ్మా.. రావమ్మా..

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:09 AM

వరుణుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని శంకరపట్నం మండలంలోని లింగాపూర్‌, ఎరడపల్లి గ్రామాల్లో కప్పతల్లి ఆట ఆడి గ్రామదేవతలకు మంగళవారం జలాభిషేకం చేశారు. మొదట మహిళలు బిందెలతో నీటిని తీసుకెళ్లి జలాభిషేకం చేశారు.

వానమ్మా.. రావమ్మా..
శంకరపట్నం మండలం లింగాపూర్‌లో గ్రామదేవతలకు జలాభిషేకం చేస్తున్న మహిళలు

శంకరపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వరుణుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని శంకరపట్నం మండలంలోని లింగాపూర్‌, ఎరడపల్లి గ్రామాల్లో కప్పతల్లి ఆట ఆడి గ్రామదేవతలకు మంగళవారం జలాభిషేకం చేశారు. మొదట మహిళలు బిందెలతో నీటిని తీసుకెళ్లి జలాభిషేకం చేశారు. అనంతరం కప్పతల్లి ఆట ఆడారు. డప్పుచప్పుళ్లతో కప్పతల్లి పాటలు పాడుతూ వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క వాన కురవలేదన్నారు. పోసిన నారు ముదురుతోందని, వేసిన నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ దేవతలు కురుణించి వర్షాలు కురిపించాలని జలాభిషేకం చేశామనిన తెలిపారు.

Updated Date - Jul 15 , 2026 | 12:09 AM