ధాన్యం కొనుగోలుకు అధికారుల సన్నద్ధం
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:30 AM
జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ నేతృత్వంతో జిల్లా పౌర సరఫరా శాఖ, సహకార శాఖ, ఐకేపీ తదితర వాటి సౌజన్యంతో పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
పెద్దపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ నేతృత్వంతో జిల్లా పౌర సరఫరా శాఖ, సహకార శాఖ, ఐకేపీ తదితర వాటి సౌజన్యంతో పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం మొత్తం 311 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన కార్యాచరణ రూపొందించింది. వీటిలో 62 ఐకేపీ కేంద్రాలతోపాటు మరో ఐదు ఇతర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఫ గ్రామాల్లో ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు
దశల వారీగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రెండు మూడు రోజులుగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రారంభిస్తున్నారు. ప్రతీ కేంద్రంలో ధాన్యం తూకం, తేమ శాతం నిర్ధారణ, శుభ్రపరిచే ప్రక్రియకు అవసరమైన యంత్రాలు, సామగ్రిని అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు.
ఫ మిల్లుల కేటాయింపుల్లో పారదర్శకత
ధాన్యం సేకరణ అనంతరం నిల్వలు, తరలింపు విషయంలో అవకతవకలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక వ్యవ స్థను రూపొందిస్తోంది. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలిం చేందుకు సమీపంలోని మిల్లులు, గోదాములను గుర్తించి కేటా యింపులు చేపట్టనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మరో రెండు, మూడు రోజుల్లో మిల్లర్లతో ఒప్పందాలు పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేటాయింపులు పొందే మిల్లర్ల నుంచి నిబంధనల మేరకు బ్యాంకు గ్యారంటీలు సైతం తీసుకోనున్నారు. ధాన్యం నిల్వలు, మిల్లుల సామర్థ్యం, ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేయ నున్నారు. గతంలో స్థల సమస్య ఏర్పడడంతో ఈసారి ప్రైవేట్ గోదాములను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఫ డిఫాల్ట్ మిల్లులకు కేటాయింపులు లేనట్లే
ధాన్యం కేటాయింపుల విషయంలో డిఫాల్ట్ మిల్లులకు అవకాశం ఉండదని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం విషయంలో బకాయిలు, ఇతర నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి డిఫాల్ట్‌గా గుర్తించిన మిల్లుల వివరాలు ఆన్లైన్లో లాక్ అయి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాంటి మిల్లులకు కేటాయింపులు చేయడం జిల్లా యంత్రాంగం పరిధిలో లేదని స్పష్టం చేస్తున్నారు. కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి వ్యక్తిగత ప్రాధాన్యతలు, వివక్షకు తావు లేకుండా ఆటోమేటిక్ విధానంలో కొనుగోలు కేంద్రాలకు సమీపం లోని అర్హత కలిగిన మిల్లులను ఎంపిక చేయనున్నారు.
ఫ జీపీఎస్ నిఘాలో ధాన్యం రవాణా
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు, గోదాములకు ధాన్యం తరలించే లారీలపై నిఘా ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ లారీకి జీపీఎస్ వ్యవస్థను అనుసంధానం చేసి, కొనుగోలు కేంద్రం నుంచి బయలుదేరిన వాహనం ఎక్కడికి వెళ్తోంది? నిర్దేశించిన మిల్లుకే చేరుతోందా? అనే అంశాలను పర్యవేక్షించనున్నారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సైతం రవాణా వ్యవస్థను ఎప్పటికప్పడు పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం పక్కదారి పట్టకుండా, కేటాయించిన మిల్లులకే చేరేలా ఈ విధానం దోహదపడనుంది.
ఫ గతానికి భిన్నంగా పకడ్బందీ చర్యలు
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కొనుగోళ్లలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసు కుంటున్నారు. కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యం సేకరణ, మిల్లుల కేటాయింపులు, రవాణా, నిల్వల వరకు పర్యవేక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందిం చడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్ణీత సమయంలో మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతున్నారు.