Share News

ఓటర్‌ జాబితాలపై అభ్యంతరాలను పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:55 PM

మున్సిపల్‌ ఓటర్‌ జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని ఎ న్నికల సంఘం కమిషనర్‌ రాణికుముదిని అధి కారులను ఆదేశించారు.

ఓటర్‌ జాబితాలపై అభ్యంతరాలను పరిష్కరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఓటర్‌ జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని ఎ న్నికల సంఘం కమిషనర్‌ రాణికుముదిని అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో మున్సిపల్‌ ఓటర్‌ జాబితాలతోపాటు ఇతర సమస్యలపై సమీక్షించారు. జిల్లాలో ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ మాట్లాడుతూ ఈనెల 12న వార్డుల వారిగా ఫోటో ఎలక్టరోల్స్‌ జాబితా ప్రచురించడంతో పాటు 13న డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాలను ప్రచురిస్తామని తెలిపారు. 16న తుది పోలింగ్‌ కేంద్రాల వివరాలను ప్రచు రించి పోలింగ్‌ కేంద్రాల వారిగా ఫోటో ఎలక్టరో ల్స్‌ ప్రచురిస్తామన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదు లను పరిశీలించి పరిష్కరించాలన్నారు. పట్టణా లలో వార్డులవారీగా డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితా జన వరి 1న విడుదల చేశామన్నారు. సీపీవో శ్రీని వాసచారి, మున్సిపల్‌ కమీషనర్‌లు ఖదీర్‌పాషా, అన్వేష్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌, టీపీవో లు అన్సారీ, సాయికృష్ణ, మెప్మ ఏవో మీర్జా ఫస హాత్‌ అలీబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:55 PM