ఓటర్ జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:55 PM
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశా లతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో విడుదల చేసిన డాఫ్ట్ ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
సిరిసిల్ల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశా లతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో విడుదల చేసిన డాఫ్ట్ ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. మంగళవారం జిల్లాలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ డాఫ్ట్ ఓటర్ జాబి తాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ గత నెల డిసెంబర్ 30వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ జాబితా ను సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో డౌన్‌లోడ్ చేసా రని, దానిని గత నెల 31వ తేదీన వార్డుల వారీగా సిద్ధం చేశారని, జనవరి 1వ తేదీన రెండు మున్సిపల్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డు లపై జాబితా అందుబాటులో పెట్టామని వెల్లడించారు. రాజకీ య పార్టీలతో జిల్లాలోని రెండు మున్సిపల్ కార్యాలయాల్లో ఈ నెల 5వ తేదీన మీటింగ్ పెట్టామని వివరించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 122836 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్లలో 39 వార్డులు ఉన్నాయని, సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39942 మంది, మహిళలు 42011 మంది, జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19580 మంది, మహిళలు 21279 మంది, జెండర్లు 18మంది ఉన్నారని వెల్లడించారు. ఓటర్ జాబితాపై ఏమైనా అభ్యంత రాలు ఉంటే సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ల్లో ఈనెల 9తేదీ సాయంత్రం 5 గంటల లోగా తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను ఆయా మున్సిపల్ కమిషనర్లు సీల్డ్ కవర్లో ఈఆర్‌ఓలకు పంపించాలని ఆదేశించారు. ఈ నెల 10వ తేదీన తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు. పలు పార్టీల ప్రతినిధులు డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి ఓటర్ల తొలగింపు, వార్డులో సీరియల్ నంబర్ వారీగా ఓటర్ జాబి తా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, బీఎస్పీ ప్రతినిధి ఏ రమేష్, టీడీపీ ప్రతి నిధి తీగల శేఖర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, డీటీసీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.