ట్రాఫిక్ రూల్స్ పాటించడం సామాజిక బాధ్యత
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:09 AM
ట్రాఫిక్ రూల్స్ పాటించడం వాహనదారుల సామాజిక బాధ్యతని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
వేములవాడ టౌన్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ రూల్స్ పాటించడం వాహనదారుల సామాజిక బాధ్యతని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మా సోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో అరైవ్.. అలైవ్.. అలెర్ట్, రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కే వాకథాన్ కార్య క్రమాన్ని శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మ హేష్ బి గితేలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా ట్రాఫిక్ రూల్స్ పాటించడం పై విద్యార్థులు డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకున్నది. డ్రంకెన్ డైరవ్.. హెల్మెట్ లేకుండా డైవ్రింగ్ చే యడంతో జరిగే అనర్థాలను వి వరిస్తూ విద్యార్థులు ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. వేములవాడ పట్టణంలోని చెక్క పల్లి చౌరస్తా నుంచి కోర్ట్ కాంప్లెక్స్ వద్ద ఉన్నక్రీడా మైదానం వ రకు ముఖ్యఅతిథులు, అధికారు లు, ప్రజలు, విద్యార్థులు 2కే వాకథాన్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రమాదాలు నివారణ కు ఆలోచన వచ్చిన వెంటనే వివిధ చర్యలను ఆచరణ లో పెట్టిందని వెల్లడించారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి వా హనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్ల లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించా లని సూచించారు. పెట్రోల్ బంకు యజమానులు సా మాజిక బాధ్యతగా హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోల్ పోయవద్దని పిలుపునిచ్చారు. చొప్పదండి ఎ మ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి యుద్ధంలా ఈకార్యక్రమాలను నిర్వహిస్తున్నార ని తెలిపారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ రోడ్డు అక్సిడెంట్స్ ఫ్రీ జిల్లాను చేద్దామన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు. రోడ్ సేఫ్టీ అంటే లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహే ష్ బి గితే అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. జిల్లలో గత ఏడాది 317 ప్రమాదాల్లో 82 మంది చనిపోయారని తెలిపారు. అందరితో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.