పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:21 AM
చిన్నారులకు నిత్యం పోష కాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : చిన్నారులకు నిత్యం పోష కాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని రగుడులోని అంగన్‌వాడీ కేంద్రా న్ని శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా చిన్నారుల కోసం తయారుచేసిన పౌష్టికాహారంతో పాటు గుడ్లను పరిశీ లించారు. రోజూ ఎంతమంది పిల్లలు వస్తున్నారు.. తదితర అంశాలపై అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వా డీ కేంద్రాల సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. కోడిగుడ్లు, పోషకాహారం తీసుకోవాలన్నారు. పిల్లలు ప్రతి రోజు అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చేలా చూడాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అటాపాటలతో పిల్లలకు సులభంగా బోధన చే యాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.