Share News

కార్మిక క్షేత్రంలో నర్సింగ్‌ విద్యార్థుల పర్యటన

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:17 AM

ప్రజల్లో ఆరోగ్య సమస్య లను తెలుసుకుని వారికి అవగాహన కల్పించడమే ధ్యేయంగా సిరిసిల్ల నర్సింగ్‌ విద్యార్థులు శ్రీకారం చుట్టారు.

కార్మిక క్షేత్రంలో నర్సింగ్‌ విద్యార్థుల పర్యటన

సిరిసిల్ల అర్బన్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజల్లో ఆరోగ్య సమస్య లను తెలుసుకుని వారికి అవగాహన కల్పించడమే ధ్యేయంగా సిరిసిల్ల నర్సింగ్‌ విద్యార్థులు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు పట్టణంలోని కార్మిక క్షేత్రమైన రాజీవ్‌నగర్‌లో శని వారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు ప్రాథ మిక ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. హెల్పింగ్‌ హార్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో నర్సింగ్‌ విద్యార్థులు రాజీవ్‌నగర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ప్రము ఖ సైకాలజిస్ట్‌ కనుకుంట్ల పున్నంచందర్‌, న్యాయవాది దాసరి తిరుమల, డాక్టర్‌ అలువాల సుమంత్‌, వార్డు కౌన్సిలర్‌ మామిడాల మహేష్‌, మాజీ మున్సిపల్‌ కో-అప్షన్‌ సభ్యుడు మాజీ సర్పంచ్‌ గొల్లపల్లి బాల య్యగౌడ్‌, వంగరి అనిల్‌, కళాశాల అధ్యాపకులు సుశీల, గ్లోరీ, సంధ్యా రాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:17 AM