ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలి..
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:26 AM
సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థా పక అధ్యక్షుడు నంద మూరి తారకరామారా వు ఆశయాలను కొనసా గిస్తామని టీడీపీ సిరిసి ల్ల నియోజకవర్గం ఇన్ చార్జి ఆవునూరి దయా కర్‌రావు అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థా పక అధ్యక్షుడు నంద మూరి తారకరామారా వు ఆశయాలను కొనసా గిస్తామని టీడీపీ సిరిసి ల్ల నియోజకవర్గం ఇన్ చార్జి ఆవునూరి దయా కర్‌రావు అన్నారు. ఆది వారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం టీడీపీ కార్యాలయం ఎదు ట టీడీపీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి ఆవునూరి దయాకార్‌రావు టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణి చేశారు. ఈసందర్భంగా దయాకర్‌రావు మాట్లా డారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, బడు గు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 44 సంవత్సరాల క్రితం తెలుగు దేశం పార్టీని స్థాపించాడని అన్నారు. కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ప్రజల ముందుకు వెల్లి తొమ్మిది నెలలో సమైఖ్యాంధ్రప్రదేశ్‌లో అధికారం లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పటేల్, పట్డారీ వ్యవ స్థను రద్దు చేసి ప్రజల వద్దకే పరిపాలనలో భాగంగా మండల వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. పేద మహిళలకు ఉచితంగా జనతా వస్త్రాలు, రెండు రూపా యలకే కిలో బియ్యంను అందించి ప్రజల మన్ననలు అందుకొని యుగపురుషుడిగా నిలిచిపోయాడన్నారు. ఎన్టీఆర్ తదనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీ సుకున్న నారా చంద్రబాబునాయుడు అన్నగారి ఆశయా లను కొనసాగిస్తూ ప్రజలకు విద్యా, ఉపాధి అవకాశా లను పెంపొందిస్తూ వచ్చాడని అన్నారు. నారా చంద్రబా బునాయుడు మండలానికో జూనియర్ కళాశాల, నియో జకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల అందించి రవాణా వ్యవస్థను కూడా ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించారని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబునా యుడు ఆశయాలను నిరంతరం కొనసాగడానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి తీసు కురావడం కోసం ప్రతి కార్యకర్త కంకణబద్ధులై ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా, పట్టణ నాయ కులు తీగల శేఖర్‌గౌడ్, మచ్ఛ అంజనేయులు, బింగి వెం కటేశం, దుమాల సత్యనారాయణ, ఆడెపు లక్ష్మీనారాయ ణ, మ్యాన వెంకటేశం, సూర్యానాయక్, చెట్కూరి నారా యణగౌడ్, రాంరెడ్డి, జెట్టి కొమరయ్య, బేతి రవీందర్, వే ముల సత్యనారాయణ,పంజ బాలరాజు, మిద్దె ప్రకాష్, గుజ్జె అశోక్, మైనంపల్లి రంగారావు, మండల రమేష్, గాజుల రమేష్, బండారి నారాయణ పాల్గొన్నారు.