Share News

బోధనేతర నియామకాలు చేపట్టాలి

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:44 AM

బోధనేతర నియామకాలు చేప ట్టాలని ఎస్‌టీయూ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు రేవోజు సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

బోధనేతర నియామకాలు చేపట్టాలి

ముస్తాబాద్‌ (గంభీరావుపేట), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : బోధనేతర నియామకాలు చేప ట్టాలని ఎస్‌టీయూ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు రేవోజు సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో రానురాను ఉపాధ్యాయులు మరమనుషులుగా భోదనేతర పనులకే అంకితం అవుతున్నారన్నా రు. ముస్తాబాద్‌ మండలం పోత్‌గల్‌లో సభ్య త్వ నమోదులో భాగంగా విచ్చేసిన సదానందం పలు అంశాలను మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ రోజుకు ఒక గూగుల్‌ ఫాం, ఆన్‌లైన్‌ వర్క్స్‌, ఎం డీఎం, ప్రశస్తు, బూట్ల కొలతలు, 18 రకాల రిజి స్టర్ల నిర్వహణతో పాటు ప్రతిదానికి గూగుల్‌ మీట్‌ సమావేశాలు, మండల స్థాయిలో సమా వేశాలు అంటూ ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారన్నారు. పానెల్‌ ఇన్‌స్పెక్షన్‌ అంటూ ఉపాధ్యాయులకు పరీక్షలు పెడుతున్నా రన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడమా.. ఆన్‌లైన్‌ పనులు చేయడమా.. పాలుపోక విద్యార్థులకు న్యాయం చేయలేక త లలు పట్టుకుంటున్నారన్నారు. ప్రాథమిక పాఠ శాలల మనుగడ కోసం జీవో25 సవరణ చేస్తూ తరగతికి ఒక ఉపాధ్యాయుడు, భోదనేతర పను లు చేయటానికి ప్రతిపాఠశాలలో ఒకరిని నియ మించాలన్నారు. మండల అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్‌రావు, ప్రధానకార్యదర్శి పోరండ్ల శ్రీని వాస్‌, జిల్లా కార్యదర్శి వెంకటేష్‌ ఉన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 12:44 AM