పల్లెల ప్రగతికి పార్టీలకతీతంగా కృషి
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:22 AM
ఎన్నికల వరకే రాజకీయమని, పల్లెల ప్రగతి, ప్రజా సంక్షేమానికి పార్టీలకతీతంగా పని చేద్దామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగంలు అన్నారు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వరకే రాజకీయమని, పల్లెల ప్రగతి, ప్రజా సంక్షేమానికి పార్టీలకతీతంగా పని చేద్దామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగంలు అన్నారు. ఎల్లా రెడ్డిపేట మండలం రాచర్లబాకురుపల్లి గ్రామంలో రూ.46 లక్షల నిధులతో తలపెట్టిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘ భవనం, సీసీ, మురుగు నీటి కాల్వ నిర్మాణాలకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం వారు భూమిపూజ చేశారు. హరిదాస్‌నగర్ గ్రామంలో ఇందిరమ్మ గృహా ప్రవేశాలకు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను సాగిస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోందని అన్నారు. గత పదేళ్లలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్‌ఎస్ కాంగ్రెస్ సర్కారుపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అప్పుల కుప్పలా మారిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ముందు చూపుతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రుణాలను అందించడంతో పాటు వ్యాపారంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 123 మహిళా గ్రామైఖ్య సంఘ భవనాలను మంజూ రు చేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలను అంది స్తూ పల్లెలు ప్రగతి పథంలో పయనించేలా ప్రభుత్వం పాటు పడుతోందని అన్నారు. రాచర్ల బాకురుపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని కేకే మహేందర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు జయశ్రీ, నాగరాజు, ఉపసర్పంచ్ రవీందర్, నాయకులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, నర్సాగౌడ్, గౌస్, రాజేందర్, దేవేందర్, భీమయ్య, శ్రీనివాస్, బాల్‌రెడ్డి, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.