Share News

మున్సి‘పోల్స్‌’కు నోడల్‌ అధికారులు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:28 AM

కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఒకటి, రెండురోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలున్నట్లు చెబుతుండడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి సోమవారం నోడల్‌ అధికారులను నియమించారు.

మున్సి‘పోల్స్‌’కు నోడల్‌ అధికారులు

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఒకటి, రెండురోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలున్నట్లు చెబుతుండడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి సోమవారం నోడల్‌ అధికారులను నియమించారు. జిల్లాలోని వివిధశాఖలకు చెందిన 12 మంది జిల్లా అధికారులను కరీంనగర్‌ కార్పొరేషన్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల నోడల్‌ అధికారులుగా నియమించారు. జిల్లా ముఖ్యప్రణాళికా అధికారి వి రాందత్తారెడ్డికి మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌, జడ్పీ సీఈవో ఎం శ్రీనివాస్‌కు ట్రైనింగ్‌ మేనేజిమెంట్‌, డీపీవో వి జగదీశ్వర్‌కు బ్యాలెట్‌ బాక్సుల మేనేజిమెంట్‌, బ్యాలెట్‌ పేపర్స్‌, జిల్లా రవాణాశాఖ అధికారి పి పురుషోత్తంకు ట్రాన్స్‌పోర్టు మేనేజ్‌మెంట్‌, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎం.అనిల్‌ ప్రకాశ్‌ కిరణ్‌కు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను అప్పగించారు. డీఆర్డీవో వి శ్రీధర్‌కు మానిటరింగ్‌ ఎంసీఓసీ అండ్‌ ఎక్స్‌పెండిచర్‌ అకౌంట్స్‌, జిల్లా సహకార అధికారి ఎస్‌ రామానుజాచార్యులుకు ఖర్చుల నిర్వహణ బాధ్యతలను, జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పి శ్రీనివాస్‌రావును అబ్జర్వర్స్‌, పరిశ్రమల జీఎం వీఎస్‌ రాజుకు పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు, డీపీఆర్వో జి లక్ష్మణ్‌కుమార్‌కు మీడియా, ఎన్‌వైకే కో ఆర్డినేటర్‌ రాంబాబుకు హెల్ప్‌లైన్‌, ఫిర్యాదుల స్వీకరణ, జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావుకు రిపోర్టులు, రిటర్న్స్‌ బాధ్యతలను కలెక్టర్‌ అప్పగించారు. జిల్లాలోని కార్పొరేషన్‌, మున్సిపాలిటీలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని నోడల్‌ అధికారులను ఆదేశించారు.

ఫ కార్పొరేషన్‌లో అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలు

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఆయన సోమవారం వారికి విధుల కేటాయింపు, బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌మొహియుద్దీన్‌, సూపరింటెండెంట్లు డి సునీల్‌కుమార్‌, షహీద, ఏఎస్‌వో ఎం మల్లేశ్వరి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎ రాజేందర్‌కుమార్‌, సెక్షన్‌ క్లర్క్‌ టి మల్లేషం, జూనియర్‌ అసిస్టెంట్‌ జి త్రివేణి, ఇన్‌చార్జి క్లర్క్‌లు కె అభిషేక్‌, కేశవరాజు శిరీష, చిరంజీవి, బి విప్లవి, ఓఎస్‌ ఎం మల్లేష్‌, జి ప్రభన్‌, ఎం అభినవ్‌కు మ్యాన్‌పవర్‌ మేనేజిమెంట్‌ పీవో, ఏపీవో, టీమ్‌ల ఏర్పాటు, అకౌంటింగ్‌ స్టాఫ్‌ తదితర బాధ్యతలను అప్పగించారు. పోలింగ్‌ మెటీరియల్‌, స్టేషనరీ కలెక్షన్‌ తదితర బాధ్యతలను డిప్యూటీ కమిషనర్‌ వేణుమాధవ్‌, మేనేజర్‌ కె శివప్రసాద్‌, ఆర్‌వో నియాజ్‌, యూడీఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లకు ఇచ్చారు. బ్యాలెట్‌ బాక్సులు, చెకింగ్‌ ఆఫ్‌ వర్కింగ్‌ కండీషన్‌ బాధ్యతలను అసిస్టెంట్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఆర్‌ఐలకు, పోలింగ్‌ స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్లు, రిసిప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు బాధ్యతలను ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ సంజయ్‌కుమార్‌, ఆర్‌ శివానంద్‌, డీఈఈలు, ఏఈఈలకు అప్పగించారు. పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు, మ్యాప్‌ల తయారీ, ప్రచురణ, పోలింగ్‌ స్టేషన్ల వారిగా ఓటర్ల జాబితా రూపొందించడం వంటి బాధ్యతలను డీసీపీ ఎండీ బషీర్‌, ఏసీపీలు వేణు, టీసీహెచ్‌ శ్రీధర్‌ప్రసాద్‌, టీపీఎస్‌, టీపీబీవోలకు అప్పగించారు.

Updated Date - Jan 20 , 2026 | 12:28 AM