Share News

వరి వద్దు.. ఆరు తడే ముద్దు

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:50 AM

ఎల్‌నినో ప్రభావంతో ఈ యేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటల్లో అంతంత మాత్రంగానే నీరు ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో యాసంగి పంటలకు అవసరమైన సాగునీటిని విడుదల చేయడానికి నిల్వలు లేకుండా పోయాయి.

వరి వద్దు.. ఆరు తడే ముద్దు

- యాసంగి యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం

- ఎల్‌నినోతో తీవ్రవర్షాభావ పరిస్థితులు

- అడుగంటిన భూగర్భ జలాలు

- చెరువులు, కుంటల్లో అంతంతమాత్రంగానే నీరు

జగిత్యాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈ యేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటల్లో అంతంత మాత్రంగానే నీరు ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో యాసంగి పంటలకు అవసరమైన సాగునీటిని విడుదల చేయడానికి నిల్వలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో యాసగి సీజన్‌లో తీవ్రనీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉండడంతో, రైతులను సన్నద్దం చేసేందుకు వ్యవసాయశాఖ ముమ్మర కసరత్తు ప్రారంభించింది.

వరి జోలికి వెళ్లకుండా..

ఎక్కువ నీరు అవసరమయ్యే వరిపంట జోలికి వెళ్లకుండా, తక్కువనీటితో పండే ఆరుతడి పంటలను సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులను చైతన్యపరిచేం దుకు వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా వేదికలతోపాటు విత్తన, ఎరువుల దుకాణాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

సిద్ధమైన యాసంగి ప్రణాళిక..

వరదలు, సాగునీటి కొరత అంచనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. గత యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 3.14లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 2.14లక్షల ఎకరాల్లో పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అంటే సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు తగ్గనున్నట్లయింది.

ఆరుతడి పంటలను ఎంచుకోవాలి..

- భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జగిత్యాల

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకూడదు. తక్కువ కాలంలో, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలి.

వ్యవసాయ శాఖ సూచిస్తున్న...నీటి లభ్యతకు తగిన ముఖ్యమైన ఆరుతడి పంటలు..

పంట రకం... కాల పరిమితి(రోజులు)

================

శనగ - 100 నుంచి 120

వేరు శనగ - 110 నుంచి 130

మినుము, పెసర - 65 నుంచి 90

ఆవాలు, ధనియాలు - 90 నుంచి 140

జొన్న, సజ్జ - స్వల్ప కాలపరిమితి

పొద్దు తిరుగుడు, నువ్వులు - 80 నుంచి 100

-----------------------------------------------------------

======================================

యాసంగి పంటల సాగు వివరాలు

పంట రకం విస్తీర్ణం(ఎకరాల్లో) - అవసరమైన విత్తనం(క్వింటాల్లో)

వరి - 2,19,467 - 54,866.8

మొక్కజొన్న - 70,639 - 5,651,1

జొన్న - 498 - 24.9

సజ్జ - 1,436 - 57.4

శనగ - 1,023 - 306.3

మినుము - 1,023 - 81.8

పచ్చి పప్పు - 3,054 - 244.3

కందులు - 98 - 7.8

బొబ్బర్లు - 142 - 14.2

పల్లి - 1,319 - 461.7

నువ్వులు - 14,723 - 368.1

పొద్దుతిరుగుడు - 17 - 1.4

ఆముదం - 2. - 0.1

ఇతర పంటలు - 896 - 179.2

Updated Date - Oct 10 , 2026 | 12:50 AM