నో హెల్మెట్.. నో పెట్రోల్..
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:53 AM
ప్రతి పెట్రోల్ బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా నో హెల్మెట్.. నో పెట్రోల్ అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపుని చ్చారు.
సిరిసిల్ల, జనవరి 12 (ఆంరఽధజ్యోతి): ప్రతి పెట్రోల్ బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా నో హెల్మెట్.. నో పెట్రోల్ అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపుని చ్చారు. రోడ్డు భద్రతా జాతీయ మాసోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానుల తో ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో గత ఏడాది 4.80 లక్షల ప్రమాదాలు జరిగాయని, దానిలో 1.70లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి రోజు రోడ్డు ప్ర మాదాల్లో 20 మంది మృతిచెందుతున్నారని వివరించారు. జిల్లాలో గత ఏడాది 290 ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేది ద్విచక్ర వాహన దారులేకేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని, వాహనదారుడు క్రమశిక్షణతో వాహనలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకోవచ్చని తెలిపారు. పెట్రోల్ బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా నో హెల్మెట్ నో పెట్రోల్ అమలుచేయాలని, బంక్‌లలో పనిచేసే సిబ్బందికి ఈ సమా చారం చేరవేసి అమలుచేయాలని ఆదేశించారు. ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ యజమానులు తమ బంక్‌లో నోహెల్మెట్.. నో పెట్రోల్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్ర ణలో సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, పౌర సరఫరాల అధి కారి చంద్ర ప్రకాశ్, డీఎం రజిత తదితరులు పాల్గొన్నారు.