అంబరాన్నంటిన నూతన సంవత్సర సంబరాలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:51 PM
జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆలయాలను సందర్శించి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలసి రావాలని మొక్కుకున్నారు.
కరీంనగర్ కల్చరల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆలయాలను సందర్శించి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలసి రావాలని మొక్కుకున్నారు. ఇళ్ల ముందు మహిళలు, యువతులు హ్యాపీ న్యూయర్‌ను తెలిపే రంగురంగుల రంగవల్లులు వేశారు. పలు చర్చ్‌లలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్వాయర్స్ బృందం గీతాలు అలరించాయి.
ఫ పోలీస్ కమిషనరేట్‌లో..
కరీంనగర్ క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొని, పోలీస్ అధికారులు, సిబ్బంది మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. 2026 సంవత్సరం పోలీస్ కుటుంబాలందరికీ సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు పాల్గొన్నారు.