Share News

నూతన ఇసుక రీచ్‌లను గుర్తించాలి

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:21 AM

జిల్లాలో ప్రభుత్వ అభి వృద్ధి పనులు, నిర్మాణాలతోపాటు వాణిజ్య నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకును అందించేందుకు నూతన రీచ్‌లను అధికారులు గుర్తించే ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు.

నూతన ఇసుక రీచ్‌లను గుర్తించాలి

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రభుత్వ అభి వృద్ధి పనులు, నిర్మాణాలతోపాటు వాణిజ్య నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకును అందించేందుకు నూతన రీచ్‌లను అధికారులు గుర్తించే ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శనివారం మైనింగ్‌, నీటి పారుదల, భూగర్భ, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, మిషన్‌ భగీరథ, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులతో జిల్లాలో నూతన ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, నిర్మాణాలు, వాణిజ్య నిర్మాణాల కోసం నూతన ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై చర్చించామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అను గుణంగా ముందుకువెళ్లాలని అధికారులను అదేశించారు. ఈ సమావేశం లో టీజీఎండీసీ పీవో శ్రీనివాస్‌, మైనింగ్‌ ఏడీ క్రాంతి కుమార్‌, టీజీ నీటి పారుదల శాఖ అధికారులు ప్రశాంత్‌, కిషోర్‌కుమార్‌, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా, తహసీల్దార్‌లు మహేష్‌కుమార్‌రావు, మురళి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:21 AM