పాఠశాలలకు అమావాస్య ఎఫెక్ట్
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:25 AM
వేసవి సెలవులకు వీడ్కోలు పలు కుతూ.. కొత్త విద్యా సంవత్సరానికి సోమవారం స్వాగతం పలుకుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులతో సందడి కనిపించాల్సి ఉండ గా పాఠశాలలన్నీ వెలవెలబోయాయి.
సిరిసిల్ల, జూన్ 15 (ఆంరఽధజ్యోతి): వేసవి సెలవులకు వీడ్కోలు పలు కుతూ.. కొత్త విద్యా సంవత్సరానికి సోమవారం స్వాగతం పలుకుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులతో సందడి కనిపించాల్సి ఉండ గా పాఠశాలలన్నీ వెలవెలబోయాయి. ప్రభుత్వ జూన్ 12 వరకు ఉన్న సెలవులను 15 వరకు పొడిగించింది. కానీ సోమవారం అమావా స్య కావడంతో తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపించ లేదు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలలకు విద్యార్థులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో వెలవెలబోయాయి. క్లాసుల్లోకి ఐదు, పది మందికి మించి విద్యార్థులు రాలేదు. మంగళవారం కూడా విద్యా ర్థులను పంపించడానికి ఇష్టపడరు. దీంతో బుధవారం నుంచి మళ్లీ పాఠశాలలు సందడిగా కనిపించనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 626 ఉన్నాయి. దాదాపు 80 మంది విద్యార్థులు చదువుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల 483 ఉండ గా రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 111 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 13 కేజీబీవీ, 7మోడల్ స్కూల్, 314 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు. 38 మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశా లలు, మూడు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఒకటి ఆర్‌బీఎస్, ఒకటి డీఎన్‌టీ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 40 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 18179 మంది. బాలికలు 20450 మంది ఉన్నారు. 21 రెసిడెన్షియల్ పాఠశాలలో 7762 మంది విద్యార్థులు ఉండగా బాలురు 2583 మంది, బాలికలు 5179 మంది ఉన్నారు.