Share News

ఘనంగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:52 PM

నగరంలోని సుభాష్‌నగర్‌ నేతాజీ విగ్రహం వద్ద నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి

కరీంనగర్‌ అర్బన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సుభాష్‌నగర్‌ నేతాజీ విగ్రహం వద్ద నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన్‌ డిసిసి అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేతాజీ జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - Jan 23 , 2026 | 11:52 PM