Share News

విధులపై నిర్లక్ష్యం వహిస్తే వేటు..

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:50 AM

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని ఎస్పీ మహేష్‌ బీ గితే హెచ్చరించారు.

విధులపై నిర్లక్ష్యం వహిస్తే వేటు..

ఎల్లారెడ్డిపేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని ఎస్పీ మహేష్‌ బీ గితే హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మీకంగా తనిఖీలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, కేసుల వివరాలు, సిబ్బంది పని తీరు, రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించి సమస్యల పరిష్కారానికి పాటు పడాలని అన్నారు. కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. రాత్రి సమయా ల్లో గస్తీ కాస్తూ దొంగతనాల నివారణకు పకడ్భందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తూ సీసీ కెమెరా ప్రాముఖ్య త, సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాల వినియో గం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు బాధ్యతయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ మహేష్‌ బీ గితే ఆదేశించారు. వెంట సీఐ వెంకటేశ్‌, ఎస్‌ఐ రమేశ్‌లు ఉన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:50 AM