నేడు నీట్
ABN , Publish Date - May 02 , 2026 | 11:24 PM
దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సులు యంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజి 2026 ప్రవేశ పరీక్ష) ఆదివారం నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిటీ కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్ తెలిపారు.
తిమ్మాపూర్, మే2(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సులు యంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజి 2026 ప్రవేశ పరీక్ష) ఆదివారం నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిటీ కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 2,928 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతున్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 11గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. అదే విధంగా పరీక్ష సమయానికి ఆరగం ట ముందే అంటే 1.30 గంటల వరకే విద్యార్థులను లోనికి అనుమతించనున్నారు. నిమిషం నిబంధనతో సమయానికి ఒక్క నిమిషం అలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు ఒక ఒరిజినల్ ఫొటో ఐడి(ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ). ఎన్‌టీఏ సూచించిన విధంగా డ్రైస్‌కోడ్ పాటించాలి. లైట్ కలర్ దుస్తులు ధరించాలి, ఎలకా్ట్రనిక్ పరిక రాలు, పెన్నులు, వాచీలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదు.