Share News

ప్రశాంతంగా నీట్‌ పీజీ

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:12 AM

నీట్‌ పీజీ-2026 పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 1471 మంది అభ్యర్థులు హాజరుకాగా 34 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్‌, తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం పర్యవేక్షించారు.

ప్రశాంతంగా నీట్‌ పీజీ
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసులు

కరీంనగర్‌ టౌన్‌/తిమ్మాపూర్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పీజీ-2026 పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 1471 మంది అభ్యర్థులు హాజరుకాగా 34 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్‌, తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించగా అభ్యర్థులను రెండు గంటల ముందునుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా సమయానికి అరగంట ముందు ప్రధాన ద్వారాలను మూసివేశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ గౌస్‌ ఆలం పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి సౌకర్యాలను, పరీక్ష నిర్వహణ, బందోబస్తును పరిశీలించారు. పరీక్ష ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసుశాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయగా ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చిత్రామిశ్రా మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతో నీట్‌ పీజీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని అన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఎక్కడా అభ్యర్థులు ఇబ్బందులు పడలేదన్నారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ పరీక్ష పారదర్శక నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Updated Date - Aug 31 , 2026 | 12:12 AM