Share News

జాతీయ రహదారి-563 పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 28 , 2026 | 12:52 AM

వరంగల్‌-కరీంనగర్‌ జాతీయ రహదారి 563 పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులను, ఆర్డీవోను ఆదేశించారు. జాతీయ రహదారి 563 పనులపై ఎనహెచఏఐ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు.

జాతీయ రహదారి-563 పనులు వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్‌-కరీంనగర్‌ జాతీయ రహదారి 563 పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులను, ఆర్డీవోను ఆదేశించారు. జాతీయ రహదారి 563 పనులపై ఎనహెచఏఐ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈదులగట్టపల్లి వద్ద సర్వీస్‌ రోడ్డు నిర్మాణ సాధ్యసాధ్యాలను పరిశీలించాలన్నారు.

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

జిల్లాలో బక్రీద్‌ పర్వదినాన్ని ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బక్రీద్‌ ఏర్పాట్లపై అధికారులతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ కాన్ఫరెన్సహాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పండుగ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. జూన 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టరేట్‌ కాన్ఫరెన్సహాల్‌లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత

కరీంనగర్‌ క్రైం: మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. జిల్లాస్థాయి నార్కోటిక్‌ కోఆర్డినేషన కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స హాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు సమన్వయంతో డ్రగ్స్‌ వాడకంపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. సమావేశంలో సీపీ గౌస్‌ఆలం, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...

మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని లైంగిక వేధింపుల చట్టం 2013పై కరీంనగర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చిత్రామిశ్రా హాజరై మాట్లాడుతూ... ఈ చట్టం మహిళా ఉద్యోగుల రక్షణ, భద్రత కోసం పని చేస్తుందని తెలిపారు.

అంగారిక టౌనషిప్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

కరీంనగర్‌ టౌన: మండలంలోని రామకృష్ణ కాలనీ రాజీవ్‌ స్వగృహ అంగారిక టౌనషిప్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ తన ఛాంబర్‌లో సంబంధితశాఖ అధికారులతో అంగారికి టౌనషిప్‌ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల స్థితిగతులను తెలుసుకొని అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 28 , 2026 | 12:52 AM