క్రమశిక్షణతో పనిచేయాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:24 AM
ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలని, మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పిలుపునిచ్చారు.
చందుర్తి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలని, మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ మండల ప్రశిక్షణ మహా అభియాన్-2026సందర్భంగా 24 గంటల శిక్షణ శిబిరం ఆదివారం నిర్వ హించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ బీజేపీ ఒక క్రమశిక్షణ గల, సిద్ధాంతపరమైన పార్టీ అని అన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ బలమైన సిద్ధాంతాలు, దేశభక్తి భావన, సేవా దృక్పథం గల పార్టీలని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను గుండెల్లో పెట్టుకుని పని చేయాలన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలి అన్న భావన ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమ న్నారు. అదే భావంతో పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి, వారి సమస్య లను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రమ శిక్షణే పార్టీ బలమని, ఒక కార్యకర్త తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ, దేశ ప్రయోజనాలను ముందుంచాలన్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిబ ద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తేనే బీజేపీ మరింత బలపడుతుందన్నారు. శిక్షణ శిబిరాలు కార్యకర్తలకు పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, విధానాలపై స్పష్ట మైన అవగాహన కల్పించి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవలో ముం దుండాలన్నారు. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కౌడిపల్లి గోపాల్ రెడ్డిలు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు మార్త సత్తయ్య, చందుర్తి, రుద్రంగి మండలాల అధ్యక్షులు మొకిలే విజేందర్, కర్ణవత్తుల వేణు, నాయకులు నంద్యడపు వెంకటేష్, పొంచేట్టి రాకేష్ పటేల్, పెరక గంగరాజు, పెరక రంజిత్, మర్రి రాజు, గంగాధర్, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.