బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:30 AM
వేములవాడ మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో జోనల్ ఆఫీసర్స్, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పీఓ లు, ఏపీఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచిం చారు.
వేములవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వేములవాడ మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో జోనల్ ఆఫీసర్స్, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పీఓ లు, ఏపీఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచిం చారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠ శాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్య క్రమానికి ఆమె హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమ, నిబంధనల స్పష్టమైన అవగాహన ఉండాలని, ఎస్‌ఈసీ కరదీపిక వెంట ఉండాల ని సూచించారు. ఎస్‌ఈసీ మార్గదర్శకాల మేర కు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయా లని వివరించారు. మున్సిపల్ ఎన్నికల డిస్ర్టి బ్యూషన్ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశా ల ఆవరణలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల సామ గ్రితో వారికి కేటాయించిన వాహనాల్లోనే వెళ్లా లని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఎన్ని కల రోజున అన్ని ఏర్పాట్లను సరి చూసుకోవా లని సూచించారు. ఓటర్లు 18రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసకువెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్, బ్యాలెట్ బాక్స్‌లు చెక్ చేసుకోని తీసుకువె ళ్లాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. గుర్తింపు కార్డు ఉన్న పోలింగ్ ఏజెంట్స్, ఎన్ని కల అధికారులు మినహా ఎవరికీ అనుమతి లేదని తెలిపారు. పోలింగ్ ము గిసిన తర్వాత సామగ్రి అంతా వేములవాడ సినారే కళామంది ర్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి అప్పగిం చాలని వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ విని యోగించుకోవాలని పిలుపుని చ్చారు. ఈనెల 8,8 తేదీల్లో సిరి సిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉం టాయని వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి కనీ స వసతులు, భోజనం ఇతర సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను, ఇన్‌చా ర్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాధాబాయి, ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ జయంత్‌కుమార్‌లు ఉన్నారు.