Share News

విధి నిర్వహణలో అప్రమత్తంగా పనిచేయాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:28 AM

పోలీసులు విధి నిర్వహణ లో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలను అందించాలని ఎస్పీ మహే ష్‌ బీగీతే కోరారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా పనిచేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు విధి నిర్వహణ లో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలను అందించాలని ఎస్పీ మహే ష్‌ బీగీతే కోరారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం విధినిర్వహణలో అప్ర మత్తతతో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌లను ఎస్పీ మహే్‌ష్‌ బీ గీతే అభినందించి ప్రశంస పత్రాలు, నగదు పారితోషికాన్ని అందించారు. ఇటీవల వేములవాడ తిప్పాపూర్‌ బస్టాండ్‌ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్‌ చేపట్టి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్‌ గంగరాజు, తంగళ్లపల్లి మండల కేంద్ర శివారులోని మానేరు వాగులో దూకి అత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని ధైర్యసాహసాలతో రక్షిం చిన అనిల్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అదనపు ఎస్పీ చంద్ర య్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:28 AM