రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:34 AM
రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు
-ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల టౌన్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల పోస్టర్‌ను రవాణా శాఖ అధికారులతో కలిసి ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, యంవిఐ ప్రమీల, రవాణా శాఖ సభ్యుడు కమటాల శ్రీనివాస్, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.