Share News

కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:40 AM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం ధర్నా చేప ట్టారు.

కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికుల ధర్నా

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం ధర్నా చేప ట్టారు. సిరిసిల్ల మున్సిపల్‌ కార్మికులందరు సీఐటీయూ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎం ప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో తరలివచ్చి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట బైటాయించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ను కలిసి సమస్యలను విన్నవించి వినతి పత్రాన్ని అందించారు. కార్మికుల సమస్యలను కలెక్టర్‌ స్పందిం చి పరిష్కరించి సమ్మెను విరమిం పజేయాలని లేకుంటే సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని సీఐటీయూ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాలడుగు సుధాకర్‌, సీఐటీయూ జల్లా కార్యదర్శి కోడం రమణలు ప్రకటించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో మున్సిపల్‌ కార్మికులకు సంబంధించిన సమస్యలను చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టడం వలన విఽధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని లేకుంటే సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. సమస్యలు పరిష్కరిం చేంతవరకు కార్మికులందరు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్‌, ఉపా ఽధ్యక్షురాలు సూరం పద్మ, కోశాధికారి అన్నల్‌దాస్‌ గణేష్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కాసారపు శంకర్‌, నాయకులు బాబాకిషన్‌, దేవ రాజు, అర్జున్‌, అరుణ్‌, విజయ, ఉమ, లక్ష్మీ, ఏసవ్వ, భారతి పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 12:40 AM