Share News

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:48 AM

తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

వేములవాడ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షకు ప్రతాప రామకృష్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమ యంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్‌, కౌన్సిలర్లు వంగల శ్రీనివాస్‌, మైలారం శ్రీనివాస్‌, కొండ్లెపు ముత్యం మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్‌, యూనియన్‌ నాయకులు నరేష్‌, దుబ్బల లచ్చయ్య, శ్రీనివాస్‌, రాజయ్య, వజ్రమ్మ, లక్ష్మి, భారతి, రాధ, మమత తదితరులు ఉన్నారు.

సిరిసిల్ల టౌన్‌ : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం రెండవ రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు కాసర్ల శంకర్‌, ప్రధాన కార్యదర్శి గుర్రం అశోక్‌, నాయకులు, బాలయ్య, బాలకిషన్‌, మమత, దేవరాజు, మహిళ కార్మి కులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:49 AM