మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:50 AM
మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిం చాలని జగిత్యాల జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఖార్టాడే కాళీచరణ్ సుదామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ఎన్నికల పరిశీలకుడు
ఖార్టాడే కాళీచరణ్ సుదామారావు
జగిత్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిం చాలని జగిత్యాల జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఖార్టాడే కాళీచరణ్ సుదామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరే ట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో ఎన్నికల పరిశీలకుడు ఖర్టాడే కాళీ చరణ్ సుదామారావు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, వ్యయ పరిశీలకుడు డి. శ్రీనివాస్‌లతో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎన్నికల పరిశీలకుడు మాట్లాడారు. నోడల్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు కేటాయిం చిన విధులను సమర్థవంతంగా నిర్వహించాల ని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమా వళికి లోబడి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పగడ్బందీగా నిర్వహిం చాలన్నారు. నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీస ర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇతర ఎన్నికలకు కేటాయించిన అధికారులందరు సమన్వయంతో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత, పారదర్శకం గా జరిగే విధంగా అందరూ కలిసి పనిచేయా లని సూచించారు.
సమన్వయంతో పనిచేయాలి
- కలెక్టర్ బి సత్యప్రసాద్
మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు సమన్వ యంతో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సి పల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించా లంటే నోడల్ అధికారుల, స్పెషల్ ఆఫీసర్లు, మున్సిప ల్ కమిషనర్లు, ఇతర ఎన్నిక లకు కేటాయించిన అధికారులం దరు నిబంధనలపై పూర్తి అవ గాహన కలిగి ఉండాలని తెలి పారు. ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, అధికారులు అప్రమ త్తంగా ఉండాలని, ప్రతి అంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని తెలిపారు. నామినేష న్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయిం పు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అనుమతు లను తీసుకోవాలంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాల వంటివి సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనచేసి అధికారులతో సమన్వ యం చేసుకొని అన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించా రు. సమావేశంలో స్థానికసంస్థల అదనపు కలె క్టర్ బి రాజగౌడ్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, జిల్లా నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీస ర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.