Share News

మున్సిపల్‌ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:46 AM

ప్రజాపాలనకు మున్సి పల్‌ ఎన్నికలు రెఫరెండం అన్న బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు చెంపపెట్టని కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌ అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనకు మున్సి పల్‌ ఎన్నికలు రెఫరెండం అన్న బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు చెంపపెట్టని కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌ అన్నారు. పట్ట ణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ప్రకాష్‌ మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తం గా కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించిందన్నారు. పది సంవత్పరాలు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో మక్కాం వేసి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవకుండా ప్రలోభాల కు గురిచేశాడని ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ప్రజలు ఇ చ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ పక్షాన శిరిసావహిస్తూ రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరవకావడం కోసం కృషి చేస్తాన్నారు. సిరిసిల్ల పట్ట ణంలోని వస్త్రపరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రు లు, స్థానిక నాయకత్వం ఎంతో కృషి చేసిందన్నారు. త్వరలో ముఖ్య మంత్రిని కలిసి సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి చేయవలసిన పనులను వివరిస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్‌ కౌన్సిలర్ల ను కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్య క్షుడు ఆకునూరి బాలరాజు, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, కాంగ్రెస్‌ నూతన కౌన్సిలర్లు ఆడెపు చంద్రకళ, వెంగళ లీల, కూర శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ ఆడెపు ప్రభాకర్‌, వెంగళ లక్ష్మినర్సయ్య, మాజీ అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌చైర్మన్‌ నీలి రవీందర్‌, నాయ కులు కోడం శ్రీనివాస్‌, వైద్య శివప్రసాద్‌, నర్సయ్య, రాజు, చందన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:46 AM