Share News

బాధ్యతలను స్వీకరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:40 PM

సిరిసిల్ల పట్టణాన్ని మరిం త అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు.

బాధ్యతలను స్వీకరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణాన్ని మరిం త అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఎండీ ఖదీర్‌పాషా సమక్షంలో చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలను స్వీకరించారు. ముందుగా చైర్‌పర్సన్‌ చాంబర్‌లో వేదపండితుల సమక్షంలో చైర్‌పర్సన్‌ దంపతులు, వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌ దంపతులు ప్రత్యేక పూజ లను నిర్వహించారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ బాధ్యతలు స్వీక రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలను అప్ప గించిన కేటీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. కేటీఆర్‌ సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బాధ్యతలను స్వీకరించిన చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ను బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌, కౌన్సిలర్లు, అధికారులు సిబ్బంది, బీఆర్‌ఎస్‌ మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:40 PM