బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకు..
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:30 PM
దేశ మాజీ ఉప ప్రధాని, దివం గత బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకువెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : దేశ మాజీ ఉప ప్రధాని, దివం గత బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకువెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులు హాజరయ్యారు. బాబు జగ్జీవన్‌రామ్ చిత్రప టానికి ప్రభుత్వ విప్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనం తరం కేక్ కట్ చేశారు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకా రులు పాటలు ఆలపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ భారత దేశ స్వాతంత్య్ర పోరా టంలో ప్రముఖ పాత్ర పోషించారని, కార్మికులకు మద్దతుగా అనేక పోరాటాలు చేశారని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ముం దుకు సాగుతామని వివరించారు. బాబు జగ్జీవన్‌రామ్ కూతురు మీరాకుమారి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నపుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఈనెలలో మహనీయుల జయంతి వేడుకలు ఉన్నాయని, ఈనెల 11వ తేదీన మహాత్మా జ్యోతిబా ఫూలే, 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయం తి వేడుకలు ఉన్నాయని తెలిపారు. ఏడాది సమయంలోపే రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట మహాత్మా జ్యోతి బా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో ఈ నెల11వ తేదీన మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని హైదరా బాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారని వెల్లడించారు. సిరి సిల్ల, వేములవాడలో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహనీయులు సేవలు గుర్తు చేస్తూ వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్ర మంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్య క్షుడు ఆకునూరు బాలరాజు, కత్తెర దేవదాస్, రాగుల జగన్, కంసాల మల్లేశం, బొప్ప దేవయ్య, గడ్డం నర్సయ్య,ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, మైనింగ్ ఏడీ క్రాం తికుమార్, ఉద్యానవన అధికారి శరత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీవైఎస్‌ఓ రాందాస్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, ఈడీ ఎస్సీ కార్పొ రేషన్ స్వప్న, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఏఎస్‌డబ్ల్యూఓ విజయలక్ష్మి, కుల సంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.