Share News

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు..

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:00 AM

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడడమే ప్రదాన లక్ష్య మని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు..

సిరిసిల్ల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడడమే ప్రదాన లక్ష్య మని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, వివిధ శాఖల అధికారులతో నిర్వ హించారు. ఈ సందర్భంగా పీఎం రహత్‌, పీఎం రాహవీర్‌, హిట్‌ అండ్‌ రన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో చేపట్టిన పనుల వివరాలు అధికారులు వెల్లడించారు. పీఎం రహత్‌ కింద ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ లో 16 మంది చికిత్స పొందినట్లు తెలిపారు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట మార్గంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యం లో నేరెళ్ల బస్వాపూర్‌ జంక్షన్‌, నేరేళ్ల గ్రామ పంచాయతీ వద్ద రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేశారని, తంగళ్లపల్లి నుంచి జిల్లెల వరకు రోడ్డు వెంట చెట్ల కొమ్మలు తొలగించినట్లు తెలిపారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో ని శాత్రాజ్‌పల్లి వద్ద మున్సిపల్‌ ఆధ్వర్యంలో రూ.లక్షతో హైమాస్ట్‌లైట్‌ ఏర్పాటు, మర్రిపల్లి వద్ద రోడ్లు, భవనాల శాఖ రహదారిపై ఏర్ప డిన గుంతలను వెట్‌ మిక్స్‌తో పూడ్చడం, కలెక్టరేట్‌, రగుడు జంక్షన్‌లో సిరిసిల్ల మున్సి పాలిటీ ఆధ్వర్యంలో బీటీరోడ్డు టాప్‌ లేయర్‌ పనులు పూర్తిచేసినట్లు వివరించారు.జిల్లాలో గత నెలలో జరిగిన ప్రమాదాలు, మరణాల పై సమీక్ష చేశారు. జిల్లాలో నెల రోజుల్లో 866 డ్రంకెన్‌డ్రైవ్‌, 45 రోడ్డు ప్రమాదాలు, 11 మంది మృతిచెందగా, 45మంది గాయప డ్డారని పోలీసులు తెలిపారు. ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న 37వాహనాలపై జిల్లా రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో ఓవర్‌లోడ్‌ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమా దాల నుంచి వాహనదారులను కాపాడడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రమాదా లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిం చే వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.సమావేశంలో ఈఈ ఆర్‌ అండ్‌ బీ భీమ్లా నాయక్‌, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌, రోడ్డు భద్రత కమిటీ స భ్యుడు శ్రీనాథ్‌, ఎస్బీ డీఎస్బీ వెంకటేశ్వర్లు, పీఆర్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, జిల్లా విద్యాధికా రి విజయసాగర్‌, జిల్లా వైద్యాధికారి ఏంజె లా ఆల్ర్ఫెడ్‌, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, లోకేష్‌, జాతీయ రహదారి అధికారు లు, ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు.

రాహ్‌-వీర్‌ కింద రూ.25వేల ఆర్థిక సహాయం

సిరిసిల్లకు చెందిన ఆటో డ్రైవర్‌ పోసు శ్రీనివాస్‌ ‘రాహ్‌-వీర్‌’ రోడ్డు ప్రమాద బాధి తులను వెంటనే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో నిర్ణీత ‘గోల్డెన్‌ హవర్‌’ లోపు తరలించి ప్రాణాలు కాపాడారు. రూ 25వేల ఆర్థికసహాయం చెక్కు అందజేశారు.

Updated Date - Nov 26 , 2026 | 12:00 AM