Share News

నూతన ఆవిష్కరణలతో ముందుకు..

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:44 AM

సైన్స్‌ మునిపెన్నడూ ఊ హించనంత అతివేగంగా నూతన అవిష్కరణలతో ముందుకు కొనసా గుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి మార్వాడి గంగరాజు అన్నారు.

నూతన ఆవిష్కరణలతో ముందుకు..

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సైన్స్‌ మునిపెన్నడూ ఊ హించనంత అతివేగంగా నూతన అవిష్కరణలతో ముందుకు కొనసా గుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి మార్వాడి గంగరాజు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం విద్యానగర్‌ జన విజ్ఞాన వేదిక కార్యా లయంలో జిల్లా అధ్యక్షుడు సిలివేరి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథి రాష్ట్ర కార్యదర్శి మార్వాడి గంగరాజు ఈసందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ప్రశ్నపై శాస్త్రీయ దృక్పథంపై దాడులు పెరుగుతున్నాయని అలాగే మధ్యయుగాల చాం దస దురాచారాలు కూడా పడగవిపుతున్నాయన్నారు.మార్కెట్‌ లాభాల కోసం, ప్రపంచ యుద్ధాల కోసం, సైన్స్‌ విజ్ఞానా ఫలాలను దుర్వినియో గం చేస్తున్నాయని మానవత్వాన్ని మంటగలిపే హేతువును పూడ్చి పెట్టే తిరోగమన శక్తుల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలన్నారు. శాస్త్రీయ విజ్ఞాన ఫలాలను ప్రజలకు అందేలా చూడల్సిన బాధ్యత జన విజ్ఞాన వేదికపై ఉందన్నారు. జిల్లాలో ప్రతి సామాన్య పౌరుని చెంతకు చేరే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచిం చారు. జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ మనిషి ఎదు ర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకునే శక్తి మనిషికే ఉందని పరిష్కారాలకు కూడా మానవ సమాజ నిర్మాణంలోనే ఉన్నా యన్నారు. అమావాస్య పేరుతో అసాస్త్రీయ భావజాలంతో కొందరు తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు వెళ్లకుండా మూడ త్వాన్ని జోడించి పాఠశాలకు దూరంచేయడం శోచనీయమన్నారు. జిల్లా ప్రధా న కార్యదర్శి పారం లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజల కోసం సైన్స్‌, ప్రగతి కోసం సైన్స్‌, స్వాలంబన కోసం సైన్స్‌, సత్యం కోసం సైన్స్‌ అనే ఆశయంతో గత 36 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక సామాన్య ప్రజలో శాస్త్రీ దృక్పథాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని 13 మండలాలలో త్వరలో మండల కమిటీలు ఏర్పాటు చేసి నూతన సభ్యత్వాల కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావే శంలో జన విజ్ఞాన వేదిక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్వస్థాపక అధ్యక్షు డు చెన్నమాధవుని రామరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ద్యావనపల్లి శ్రీహరి, నాయకులు రాజు, సత్యం పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:44 AM