Share News

విద్యార్థి దశ నుంచే ప్రణాళికలతో ముందుకు..

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:12 AM

విద్యార్థి దశ నుంచే ప్రణాళికలతో అభ్యసించి ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

విద్యార్థి దశ నుంచే ప్రణాళికలతో ముందుకు..

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశ నుంచే ప్రణాళికలతో అభ్యసించి ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద (సీఎస్‌ అర్‌) ఇటీవల స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ ఎం పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూంను బుధవారం బ్యాంక్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించారు. అలాగే కలెక్టర్‌ ప్రత్యేక చోరవతో వేములవాడ కేజీబీవీ విద్యార్థులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రూ.22లక్షలతో 145 బెడ్స్‌, పరుపులు ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ్‌సాగర్‌, త హసీల్దార్‌ మహేశ్‌, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ రాజీవ్‌ కుమార్‌, హెచ్‌ డీఎఫ్‌సీ బా ధ్యులు శ్రావణ్‌కు మార్‌, నాగేశ్వరరా వు, కమలాకర్‌, మండల విద్యాధికా రి దూస రఘుపతి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం మోతిలాల్‌, ఏఏపీ సీ చైర్‌పర్సన్‌ తిప్ప వరం సుధ, హెచ్‌ఎం చక్రవర్తుల రమాదేవి, వార్డు కౌన్సిలర్‌లు లింగంపల్లి భాగ్యలక్ష్మి, దొంతి నేని కళ్యాణి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:12 AM